ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'మాకే వ్యతిరేకంగా పనిచేస్తారా'- మహిళపై వైఎస్సార్సీపీ నేతల దాడి - YSRCP Leaders Attack Women - YSRCP LEADERS ATTACK WOMEN

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 12:27 PM IST

YSRCP Leaders Attack Women in Satyasai District : ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ రోజు, అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనే శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. ధర్మవరంలోని కేతిరెడ్డి కాలనీలోని దళిత కుటుంబంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కు మద్దతుగా పనిచేస్తారా? అంటూ నాగమణి, ఆమె కుమారులు రామాంజనేయులు, నగేశ్​పై వైఎస్సార్సీపీ వర్గీయులు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. 

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడిలో గాయపడిన నాగమణి, ఆమె కుమారులు రామాంజనేయులు, నగేశ్ అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలు నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ వ్యతిరేకంగా పని చేశారని బెదిరించడంతోపాటు తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని నాగమణి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details