ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పంచాయతీ భవనంలో మద్యం - వైఎస్సార్​సీపీ సర్పంచ్​ భర్తపై టీడీపీ నేతల ఫిర్యాదు - YCP Leader Liquor Bottles Stored - YCP LEADER LIQUOR BOTTLES STORED

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 4:58 PM IST

YSRCP Leader Liquor Bottles Stored in Secretariat: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పుల్లిత్తివారిపల్లి పంచాయతీ భవనంలో మద‌్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. వైసీపీకి చెందిన సర్పంచ్‌ ఫజిల్లా భర్త అంజాద్‌ పాత పంచాయతీ భవనంలో దాచిన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొద్దిరోజులుగా రాత్రి సమయాల్లో అక్కడ మద్యం తాగుతున్నట్లు గమనించిన తెలుగుదేశం నాయకులు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టిన పోలీసులు 3కేసుల్లోని 141మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఫజిల్లా అంజాద్ 8 నెలలుగా సచివాలయ తాళాలు ఇవ్వలేదని గ్రామ కార్యదర్శి పోలీసులకు తెలిపారు. టీడీపీ నేతల వద్ద మద్యం ఉందన్న సమాచారం వస్తేనే పోలీసులు అదుపులోకి తీసుకునేవారని వారు విమర్శించారు. ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంచేందుకు ప్రభుత్వ భవనంలో మద్యం నిల్వ ఉంచారని అక్కడి నుంచే పరిసర గ్రామాలకు బాటిళ్లను తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details