వైఎస్సార్సీపీ సర్కార్ నిర్వాకం - తుప్పుపట్టిన వాహనాలు - YSRCP Govt Neglects Vehicles - YSRCP GOVT NEGLECTS VEHICLES
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 24, 2024, 7:25 PM IST
YSRCP Govt Neglects Vehicles Sanctioned Under SC Corporation : కడపలో ఎస్సీ కార్పొరేషన్ కింద మంజూరైన వాహనాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అటకెక్కించింది. గత టీడీపీ హయాంలో కొనుగోలు చేసిన వాహనాలను జగన్ ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో అవి తుప్పు పట్టాయి. ఐదేళ్లుగా ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు నిరుపయోగంగా మూలనపడి ఉన్నాయి. ఎస్సీల కోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన వాహనాలను 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లబ్ధిదారులకు అందజేయలేదు. ఫలితంగా 2 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. ప్రస్తుతం ఆ వాహనాలన్నీ పిచ్చి మెుక్కల మధ్యలో తుప్పు పట్టి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వాహనాలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లయినా వాటిని పంపిణీ చేయకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. లక్షల రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.