ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ కక్షపూరిత చర్యలపై న్యాయ పోరాటం చేస్తా: బహిష్కృత ఎమ్మెల్సీ రఘురాజు - YSRCP Disqualified MLC Raghu Raju - YSRCP DISQUALIFIED MLC RAGHU RAJU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 6:31 PM IST

YSRCP Disqualified MLC Raghu Raju: చేయని తప్పునకు అన్యాయంగా తనపై వేటు వేశారని వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్సీ రఘురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని షెడ్యూల్-10 ప్రకారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితేనే పదవి నుంచి తొలగించాలని, తానేమీ నేరం చేయకుండానే డిస్మిస్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తన భార్య సుధారాణి వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరితే తనకేం సంబంధమని మండలి ఛైర్మన్ తన నుంచి వివరణ తీసుకోకుండానే పదవి నుంచి తప్పించారన్నారు. కక్షపూరిత చర్యలపై న్యాయపోరాటం చేస్తానని రఘురాజు తేల్చిచెప్పారు.

"చేయని తప్పునకు అన్యాయంగా నాపై వేటు వేశారు. మే 3న అర్థాంతరంగా ఎమ్మెల్సీ పదవి నుంచి డిస్మిస్ చేశారు. షెడ్యూల్-10 నిబంధనలు ఉల్లంఘించారంటూ నోటీసులుఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండానే పదవి నుంచి తప్పించారు. నా భార్య సుధారాణి టీడీపీలో చేరితే నాకేం సంబంధం? కక్షపూరిత చర్యలపై న్యాయ పోరాటం చేస్తా." - రఘురాజు, వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్సీ

ABOUT THE AUTHOR

...view details