ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ నేతల కవ్వింపు చర్యలు- ధీటుగా సమాధానం ఇచ్చిన టీడీపీ శ్రేణులు - YSRCP Activists Provoking - YSRCP ACTIVISTS PROVOKING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 8:10 PM IST

YSRCP Activists Provoking Activities On TDP Leaders at Uravakonda: అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ బుధవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీగా తరలి వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. 

వైఎస్సార్సీపీ శ్రేణులు జాతీయ రహదారిలో నిల్చుని టీడీపీ సభకు వెళ్తున్న వారికి వైఎస్సార్సీపీ సిద్ధం జెండాలను చూపిస్తూ కేకలు వేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ అల్లరి మూకల చేష్టలను పట్టించుకోకుండా, దానికి ధీటుగా సభకు కదలి వెళ్లారు. దానిని చూసిన వారంతా అల్లర్లు స్పష్టించడమే వైఎస్సార్సీపీ లక్ష్యమా అని చర్చించుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా దురుద్దేశంతో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా ఈ విధంగా చేయటంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని సర్వేల్లో తెలియడంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details