ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ నేతల దాష్టీకం- టీడీపీకి ఓటేశారని ముగ్గురిపై దాడి - YCP ACTIVISTS ATTACK oN TDP - YCP ACTIVISTS ATTACK ON TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 1:43 PM IST

YSRCP Activists Attack With TDP Ranges in Pedduru: ఎన్నికలు ముగిసినా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకుల దాష్టీకాలు ఆగడం లేదు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ననియాలలో వైసీపీ నాయకులు సత్యేంద్ర, వెంకటేశ్, చంద్రశేఖర్‌ ఆరాచకం సృష్టించారు. టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు నరసింహులుతో పాటు మరో ఇద్దరు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. మండలంలోని పెద్దూరుకు చెందిన నరసింహులు, గణపతి చంద్రబాబు కారులో రామకుప్పం వస్తుండగా ననియాల వద్ద కారును అడ్డగించి వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. 

YSRCP Activists Attack Former MPTC: ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేశామనే కారణంతో పెద్దూరుకు చెందిన ముగ్గురు వైసీపీ శ్రేణులు మారణాయుధాలతో తమపై దాడి చేశారని బాధితులు వాపోయారు. టీడీపీకి ఓటు వేయడంతో కక్షగట్టిన వైఎస్సార్సీపీ శ్రేణులు తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు పేర్కొన్నారు. ఈ దాడిపై రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నరసింహులు తెలిపారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details