దెందులూరులో మళ్లీ గొడవ- టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడిన వైఎస్సార్సీపీ శ్రేణులు - YsrCP Activists Attack TDP Leaders - YSRCP ACTIVISTS ATTACK TDP LEADERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 1:00 PM IST
YSRCP Activists Attack On TDP Leaders In Eluru District : ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్సీపీ శ్రేణులు మరోసారి రెచ్చిపోయాయి. పెదవేగి మండలం విజయిరాయిలో తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలపై ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డాయి. వైఎస్సార్సీపీ శ్రేణుల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. తెలుగుదేశం కార్యకర్త ప్రభాకర్ తలకు బలమైన గాయం కావడంతో ఏలూరులోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు.
Chintamaneni Prabhakar : వైఎస్సార్సీపీ శ్రేణుల దాడికి నిరసనగా విజయరాయిలో చింతమనేని ప్రభాకర్ ధర్నాకు దిగారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పలువురు విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ప్రత్యర్థులపైకి గొడవలకు దిగి దాడులు చేస్తున్నారు. ప్రచారాల్లో ఉద్రిక్త వాతావరణానికి కారకులవుతున్నారు. ఇప్పటి పలు చోట్ల జరిగిన ఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ వైఖరి మార్చకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.