LIVE: వైఎస్ వివేకా హత్య కేసుపై సునీత- ప్రత్యక్షప్రసారం - YS Viveka Daughter Sunitha
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 2, 2024, 11:16 AM IST
|Updated : Apr 2, 2024, 11:26 AM IST
YS Viveka Daughter Sunitha Live: 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదులు రక్తంతో తడిసిపోయాయి. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ నుంచి బయటకు రావాలి. లేకపోతే ఆ పాపం చుట్టుకుంటుంది' అని వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు. 'మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దాం, మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు, జగనన్న పార్టీని ఎన్నికల్లో గెలవనీయకూడదు' అని పిలుపునిచ్చారు. తన తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలని సునీత అన్నారు. వివేకానందరెడ్డికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని చెప్పారు.వైఎస్సార్సీపీకి ఓటు వేయవద్దని, వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని దించాలని పిలుపునిచ్చారు. తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు, చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్నవాళ్లు మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు. కాగా వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ సునీత మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Apr 2, 2024, 11:26 AM IST