ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: తిరువూరులో షర్మిల న్యాయ యాత్ర - ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila LIVE - YS SHARMILA LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 11:10 AM IST

Updated : Apr 26, 2024, 11:35 AM IST

YS Sharmila Nyaya Yatra Public Meeting in Tiruvuru LIVE : ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ న్యాయ యాత్రలో భాగంగా తిరువూరులో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రాచారంలో భాగంగా సీఎం జగన్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "వేల మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా సీఎం జగన్‌ నేను ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించారు. నేను పచ్చ చీర కట్టుకున్నానట. పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుకు మోకరిల్లినట్లు జగన్‌ చెప్పడాన్ని ఏమనుకోవాలి. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నానట. పచ్చచీర కట్టుకుంటే తప్పేముంది. చంద్రబాబు పచ్చరంగు ఏమైనా కొనుక్కున్నారా? పసుపు రంగుపై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్‌ ఉందా? జగన్‌ మరిచిపోయినట్లున్నారు... సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌లో పైన పసుపు రంగు ఉంటుంది. అప్పట్లో వైఎస్సార్‌ పసుపు రంగు ఉంటే తప్పేముంది. అది తెదేపా సొంతం కాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్లు పసుపు చీర గురించి మాట్లాడతారా? నా దుస్తుల గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? జగన్‌రెడ్డికి అసలు సంస్కారం ఉందా?" అని షర్మిల మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, విజయవాడ, గుంటూరు జిల్లా సంజీవయ్యనగర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో షర్మిల మాట్లాడారుప్రస్తుతం తిరువూరులో షర్మిల న్యాయ యాత్ర - ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Apr 26, 2024, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details