ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఇరువర్గాల మధ్య పందుల వివాదం - యువకుడు హత్య - young man murdered in Rallamitta - YOUNG MAN MURDERED IN RALLAMITTA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 6:38 PM IST

Young Man Died in the Clash Between the Two Sides :  నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీకి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే, 

రాళ్లమిట్టలో పందుల విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన వివాదంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీకి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. నాగరాజు మరో ఇద్దరు యువకులతో కలిసి రాళ్లమిట్ట ప్రాంతానికి వెళ్లిన సమయంలో మరో వర్గానికి చెందిన వారు తమ పందులను ఎత్తుకెళ్తున్నారంటూ అడ్డుకోవటంతో ఘర్షణ నెలకొంది. నాగరాజుపై మరో వర్గానికి చెందిన యువకులు కత్తితో దాడి చేయటంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి వర్గీయులు రాళ్లమిట్టకు చేరుకుని ఇళ్లు, వాహనాలపై దాడులకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో రాళ్లమిట్టకు చెందిన మరో ఇద్దరు కత్తిపోట్లకు గురికాగా వారిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details