రామాపురం బీచ్లో విషాదం -సముద్రపు గల్లంతైన విద్యార్థి మృతి - Young Man Dead Caught Sea Waves - YOUNG MAN DEAD CAUGHT SEA WAVES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 6:59 PM IST
Young Man Dead After Caught in Sea Waves: సముద్రపు అలల్లో చిక్కుకుని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్లో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన నలుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై రామాపురం సముద్ర తీరానికి వచ్చారు. నలుగురు సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసాకరిగా అలల తాకిడి ఎక్కువ కావడంతో, కనగళ్ల గౌరీష్ అల్లల్లో చిక్కుకొని మృతి చెందాడు. చనిపోయిన గౌరీష్ తాడేపల్లిగుడెంలో నివసించేవాడని అతని స్నేహితులు తెలిపారు.
చెన్నెలో ఒక ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నట్లు స్నేహితులు తెలిపారు. చెన్నై నుంచి విజయవాడ స్నేహితుల దగ్గరకు గౌరీష్ వచ్చాడు. తామంతా కలసి సరదగా గడిపెందుకు రామాపురం వచ్చామని ఇంతలోనే ఈ విషాదం జరిగిందని స్నేహితులు చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.