జీపు అడ్డంగా పెట్టి యువతి కిడ్నాప్- అడ్డుకున్న తండ్రిపై దాడి - కర్నూలు జిల్లాలో యువతి కిడ్నాప్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 25, 2024, 5:06 PM IST
Yong Woman Kidnap Case: కర్నూలు జిల్లాలో ఓ యువతి సినిమా తరహాలో అపహరణకు గురైంది. పత్తికొండ మండలానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి బయల్దేరాడు. పత్తికొండలోని ఆసుపత్రి(Hospital in Pattikonda)కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో దూదెకొండ వద్ద రోడ్డుకు అడ్డంగా జీపు ఉండటంతో వారు వాహనాన్ని పక్కకు ఆపారు. ఈ క్రమంలో దేవనకొండ మండలం కప్పట్రాళ్లకు చెందిన సత్యంనాయుడు అనే యువకుడు జీపులో వచ్చి అటకాయించాడని యువతి తండ్రి తెలిపారు.
రివాల్వర్ (Revolver) తో బెదిరించి బలవతంగా యువతిని జీపు(Jeep)లో ఎక్కించి తీసుకెళ్లాడని పేర్కొన్నారు. అడ్డుకోబోయిన తనను గాయపరిచాడని యువతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన యువతి తండ్రికి పత్తికొండ ప్రభుత్వాసుపత్రిలో చేరగా వైద్యులు చికిత్స అందించారు. వెంటనే ఈ ఘటనపై పోలీసుల (Police) కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును చేధించి యువతీ, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వ్యవహారమే (Love Affair) అపహరణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.