ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అర్ధరాత్రి హల్ చల్- దళితుల ఇళ్లపై దాడి - YCP MLA Topudurthi Prakash Reddy - YCP MLA TOPUDURTHI PRAKASH REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 8:19 PM IST

Thopudurthi brother attacked on Dalits: అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారు. గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన ఎస్సీలు, వాల్మీకుల ఇళ్లపైకి దాడికి వెళ్లారు. ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యాన్ని స్థానిక యువకుడు ఫోన్‌లో చిత్రీకరించాడు. దీన్ని గమనించిన రాజశేఖర్‌రెడ్డి అనుచరులు ఫోన్ లాక్కునేందుకు యువకుడిపై దాడికి యత్నించారు. ఎస్సీలు, వాల్మీకీ కుటుంబాల్లోని మహిళలు తిరగబడటంతో ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు, అక్కడి నుంచి జారుకున్నారు. దాడి జరుగుతుందని ఫోన్ చేసినా ఇటుకలపల్లి సీఐ స్పందించలేదు. అర్ధరాత్రి గ్రామంలో బీట్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అటువైపు కన్నెత్తి చూడలేదు. అర్ధరాత్రి తోపుదుర్తిలో ఎమ్మెల్యే సోదరుడు దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని జిల్లా ఎస్పీకి పరిటాల సునీత ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసులు వైసీపీ నేతలకు అనుకులంగా పని చేస్తున్నారని ఆరోపించారు. దళితుల ఇళ్లపై దాడి చేసిన తోపుదుర్తి సోదరుడితోపాటుగా, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని సునీత డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details