ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎమ్మెల్యే కోలగట్లపై వైఎస్సార్సీపీ నాయకుల అసంతృప్తి - పార్టీకి రాజీనామా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 10:47 PM IST

YCP Leaders Fire on Mla Kolagatla Veerabhadra Swamy : వైఎస్సార్సీపీ పార్టీలో తమకు కనీస గౌరవం లేదని విజయనగరం వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వకుండా లోకల్ ఎమ్మెల్యే, డీప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి శాసిస్తున్నారని వాపోయారు. దీంతో సీనియర్ నాయకులు పిల్లా విజయకుమార్, అవనాపు విజయ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారి అనుచరులతో కలిసి వైసీపీకి రాజీనామాలు చేసి లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఏ పార్టీలో అయిన కిందిస్థాయిలో పరిస్థితి బాగోలేనప్పుడు పైనున్న నాయకులు వాటిని సరిచేయాలి. కానీ ఇలాంటి సంప్రదాయం వైసీపీ పార్టీలో కరువైందని విమర్శించారు.

మేము పార్టీకి ఏం నష్టం చేశామని కోలగట్లను ప్రశ్నించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతి పనిలో మేమే ముందుండి కార్యక్రమాలు చేసేవారిమని తెలిపారు. అటువంటి వారినే దూరం పెట్టాడం దుర్మార్గమని మండిపడ్డారు. నియోజకవర్గంలో నియంతల వ్యవహరిస్తున్న కోలగట్లను కంట్రోల్ చేయలేని పరిస్ధితిలో పార్టీ ఉందని తెలిపారు. ఇతని బాధను తట్టుకోలేక చాలా మంది కార్పొరేటర్​లు పార్టీ నుంచి బయటకి రావడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు. కోలగట్ల వీరభద్ర స్వామి హయాంలో ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో హత్యలు, తగాదాలు, గంజాయి వ్యాపారం పెరిగిపోయిందని విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details