ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రజాగళం సభకు వెళ్లాడని టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి- ఓటమి భయంతోనే దాడి చేశారన్న అచ్చెన్నాయుడు - YCP Leaders Attack in TDP Leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 11:53 AM IST

YCP Leaders Attacked TDP Activist at Prakasam District: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ పరిధి పరమేశ్వర నగర్‌లో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రజాగళం సభకు వెళ్లాడనే కారణంతో తెలుగుదేశం కార్యకర్త మునయ్యపై వైసీపీ వర్గీయులు గొడ్డలితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మునయ్యను స్థానికులు చికిత్స కోసం గిద్దలూరు నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మునయ్య మృతి చెందాడు. పరమేశ్వర నగర్‌కు చెందిన వైసీపీ కార్యకర్తలు అల్లూరయ్య, రంగనాయకులు, ప్రేమ్‌కుమార్‌, ఈశ్వరయ్య కలిసి మునయ్యపై గొడ్డలితో దాడి చేసి పరారయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

 TDP Activist Dead React on TDP Leader Atchannaidu: వైఎస్సార్సీపీ నేతలు అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు చేసిన వారిని వదిలేది లేదని ధ్వజమెత్తారు. ప్రజాగళం సభకు జనాన్ని తరలించాడన్న అక్కసుతోనే చంపేశారని మండిపడ్డారు. మునయ్యపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మునయ్య కుటుంబానికి పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని అచ్చెన్న భరోసా ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details