వైసీపీలో స్థానికేతరులకే టికెట్లు- ఆత్మహత్య చేసుకుంటానంటూ స్థానిక నేత సెల్ఫీ వీడియో - YCP leader Video in Satyavedu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 12:34 PM IST
YCP Leader Suicide Video Viral in Tirupati District: తిరుపతి జిల్లా సత్యవేడులో ఓ వైసీపీ నేత చేసిన వీడియో కలకలం రేపుతోంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ కేవీబీపురం మాజీ జెడ్పీటీసీ (ZPTC) సభ్యుడు డేవిడ్ తీసుకున్న సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ అడిగినా అధిష్ఠానం పట్టించుకోకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయించడం బాధగా ఉందంటూ తాను తీసుకున్న సెల్ఫీ వీడియోను వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. వీడియోలో ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేసిన డేవిడ్ అనంతరం ఆచూకీ లేకుండా పోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తన కుమారుడి ఆచూకీ తెలపాలని డేవిడ్ తండ్రి ప్రభుదాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డేవిడ్ కోసం ఓ వైపు పోలీసులు, మరో వైపు వైసీపీ శ్రేణులు అతని కోసం గాలిస్తున్నారు. 'టీ తాగేందుకు స్థాయి లేదు కానీ ఎమ్మెల్యే టికెట్ అవసరమా అంటూ కొంత మంది వైసీపీ పెద్దలు తన గురించి ప్రస్తావించడం బాధగా అనిపించించిందని వైసీపీ జెండా మోసినందుకు పార్టీ నాయకులు నాకిచ్చే గౌరవం ఇదేనా అంటూ సెల్పీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.