ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రేమ పేరుతో వైసీపీ ఉప సర్పంచ్‌ కుమారుడు వేధింపులు - యువతి ఆత్మహత్యాయత్నం - ycp leader son Harassment on girl

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 10:15 PM IST

YCP Leader Son Harassment on Girl in Palnadu District : వైసీపీ ఉప సర్పంచి కుమారుడి వేధింపులు తట్టుకోలేక ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జిల్లాలోని సత్తెనపల్లి మండలం భృగుబండలో చోటు చేసుకుంది. ఉప సర్పంచి ఆంజనేయులు కుమారుడు నవీన్, బాధితురాలు ఒకే కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. నవీన్ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. నవీన్ వేధింపులు భరించలేని ఆమె ఈ నెల 12వ తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. 

ప్రస్తుతం సత్తెనపల్లిలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నవీన్ వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 12వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేసినా వైసీపీ నేత కుమారుడు కావడంతో కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని పోలీస్టేషన్​లో కేసు పెడితే దాన్ని నమోదు చేయనీయకుండా చివరికి  వైసీపీ నేతలు తమపైనే  బెదిరింపులకు పాల్పడుతున్నారని యువతి తల్లిదండ్రులు వాపోతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details