ప్రచారానికి రావడం లేదని- మాజీ మహిళా వాలంటీర్‌పై వైసీపీ నేత దాడి - YCP leader attacked woman volunteer
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 10:43 PM IST
YCP Leader Attacked on Former Woman Volunteer in Anantapur District : మాజీ మహిళా వాలంటీర్‌పై వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కుమారుడు దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లాల కలకలం రేపింది. జిల్లాలోని కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన మాజీ వాలంటీర్ ఎన్నికల ప్రచారానికి రావటంలేదంటూ వైసీపీ కౌన్సిలర్ భాగ్యమ్మ కుమారులు దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే, కళ్యాణదుర్గం పట్టణం కుమ్మరి వీధి సచివాలయం 19వ వార్డ్ వాలంటీర్‌గా పనిచేస్తున్న నళిని కొన్ని కారణాలతో వాలంటీర్ పదవికి రాజీనామా చేసింది. అయినా పార్టీ మీద అభిమానంతో ప్రతిరోజూ ఎన్నికల ప్రచారానికి వెళ్తుంది. రెండు రోజులుగా జ్వరం రావడంతో ప్రచారానికి నళిని దూరంగా ఉంది.
దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్ భాగ్యమ్మ కుమారుడు నళిని ఇంటికి వెళ్లి ఆమె తల్లిని దర్భాషలాడారు. అదే సమయంలో కౌన్సిలర్ ఇంట్లోనే నళిని ఉంది. వెంటనే అక్కడికి చేరుకున్న మారుతి, నువ్వు సరిగ్గా రావు, పనిచేయవు అంటూ నళిని చెంపమీద కొట్టాడు. అనంతరం ఇంట్లో నుంచి బయటకు వెళ్లమంటూ బెదిరించారు. వెంటనే విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన నళిని తల్లి, చెల్లిని కూడా మారుతి దుర్భాషలాడుతూ దాడి చేశారు. తమతో పెట్టుకుంటే చంపేస్తామని బెదిరించారని బాధితురాలు ఆవేదన చెందారు.