ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన - వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌ - Former YCP Mla Sudhakar Arrest - FORMER YCP MLA SUDHAKAR ARREST

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 4:57 PM IST

YCP Former MLA Sudhakar Arrested in Kurnool District : కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో తన ఇంట్లో పనిచేసే మైనర్ బాలికతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో సుధాకర్‌ తీరుపై అప్పట్లో మహిళా సంఘాలు మండిపడ్డాయి. కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇటీవల ప్రభుత్వం మారడంతో ఆయనపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈరోజు సుధాకర్ కర్నూలులోని నివాసంలో ఉండగా రెండో పట్టణ పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి ఓర్వకల్లు పోలీసు స్టేషన్ కు తరలించిట్లు సమాచారం. ఆ తర్వాత సుధాకర్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.

కాగా, 2019 ఎన్నికల్లో సుధాకర్‌ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జగన్‌ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. సుధాకర్‌ స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సోదరుడు సతీశ్‌కు టికెట్‌ కేటాయించారు. అయినప్పటికీ కోడుమూరులో వైసీపీకి ఓటమి తప్పలేదు.

ABOUT THE AUTHOR

...view details