ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రంగబాబుపై దాడి ఎమ్మెల్యే వంశీ అనుచరుల పనే - వీడియో విడుదల చేసిన యార్లగడ్డ వెంకట్రావు - రంగబాబుపై దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 4:05 PM IST

Yarlagadda Venkatarao Release Video Attack on Rangababu: గన్నవరంలో తెలుగుదేశం నేత రంగబాబుపై దాడికి పాల్పడింది ఎమ్మెల్యే వంశీ అనుచరులే అంటూ ఓ వీడియోను యార్లగడ్డ వెంకట్రావు విడుదల చేశారు. ఘటన జరిగి మూడు రోజులైనా చర్యలు శూన్యమని ఆయన మండిపడ్డారు. తాము ఇచ్చిన సీసీటీవీ దృశ్యాలు చూసైనా ఎమ్మెల్యే వంశీ అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్దేశ్య పూర్వకంగా హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిసినా సెక్షన్ 306కి బదులు సెక్షన్ 326గా మార్చడంలో ఎమ్మెల్యే వంశీ పాత్ర ఉందని యార్లగడ్డ వెంకట్రావ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అసలేం జరిగిందంటే - ఆదివారం మధ్యాహ్నం కాసరనేని రంగబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఒక ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ సీఈవో వెంట కారులో హైదరాబాద్‌ నుంచి వస్తున్నట్లు ఆయన తెలిపారు. అప్పటికే అక్కడ కారులో వేచి చూస్తున్న వ్యక్తి వచ్చి రంగబాబుతో మాట్లాడి వేర్వేరు వాహనాల్లో అక్కడి నుంచి బయలుదేరారు. ఇంతలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారులో నుంచి ఐదుగురు కిందికి దిగారు. వీరితోపాటు పొలం చూస్తామంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు కలిసి బేస్‌బాల్‌ స్టిక్స్‌తో రంగబాబు కారును అడ్డగించి ఆయన కాళ్లు, చేతులపై దాడి చేసి పరారయ్యారు. కాళ్లతోపాటు చేతి ఎముకలు కూడా విరిగినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details