భర్తకు మద్యం తాగించి- వివాహితపై సామూహిక అత్యాచారం - Woman Gang Raped - WOMAN GANG RAPED
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 12:41 PM IST
Woman Gang Raped Infront of Her Husband in Eluru District : పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ మహిళపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఏలూరులో జరిగింది. పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి, అతని రెండో భార్య ఏలూరు వన్‌టౌన్ రామకోటి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 15 రోజుల క్రితం పొట్టకూటి కోసం ఏలూరు నగరానికొచ్చిన వీరు పగలు హోటల్లో పని చేస్తూ రాత్రి రామకోటిలో ప్రాంతంలో విశ్రమిస్తారు. వీరికి నగరానికి చెందిన ముగ్గురు యువకులు పరిచయమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు, విజయరాయి వ్యక్తి కలిసి మద్యం తాగారు. అనంతరం అతనిపై దాడి చేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ అఘాయిత్యాన్ని అడ్డుకోలేని భర్త కేకలు వేస్తూ రోడ్డుపైకి వచ్చాడు. అటుగా వెళ్తున్న యువకుడిని సహాయం చేయమని కోరారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో కేసు నమోదు చేశారు. అత్యాచారం ఘటనలో నిందితులైన ముగ్గురు యువకులను ఏలూరు వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.