దారుణం.. అద్దె అడుగుతోందని హతమార్చాడు - Woman Brutally Murdered - WOMAN BRUTALLY MURDERED
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2024, 3:17 PM IST
Woman Brutally Murdered in Bapatla District : బాపట్ల జిల్లా చీరాలలో విజయలక్ష్మి అనే వృద్ధురాలి మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. జీవనం కోసం వ్యాపారం చేసుకుంటానంటే కుమార్ తేజ అనే వ్యక్తికి తనకున్న ఖాళీ స్థలాన్ని అద్దెకిచ్చింది. స్థలానికి సంబంధించిన అద్దెను సక్రమంగా చెల్లించలేదని విజయలక్ష్మీ వాదించారు. ఆగ్రహించిన నిందితుడు అతని దగ్గర పనిచేస్తున్న రాము సాయంతో విజయలక్ష్మిని హతమార్చాలని పథకం పన్నాడు. ఈ నెల 15న అద్దె ఇస్తానని నమ్మించి విషం కలిపిన శీతల పానియాన్ని తాగించి హతమార్చాడు. అనంతరం ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని మృతదేహాన్ని గంగదేవిపల్లి గ్రామ శివారులో పెట్రోల్ పోసి హతమార్చాడు.
ఈ నేపథ్యంలోనే తన తల్లి కనబడుట లేదని మృతురాలి కుమారుడు వెంకటరమణ ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు స్వర్ణ వైపు నుంచి చీరాలకు వస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. తమే హత్యచేసినట్లు నిందితులు ఒప్పుకోవడంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.