ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కష్ఠపడితేనే గెలవగలం - వైఎస్సార్సీపీ శ్రేణులకు నేతల నిర్దేశం - ysrcp meeting - YSRCP MEETING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 6:16 PM IST

YSRCP Meeting at Vizianagaram : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం విజయనగరంలోని జగన్నాథం ఫంక్షన్ హాల్​లో జరిగింది. ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రాజన్నదొరతో పాటు ఇరు జిల్లాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, క్రీయాశీల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. విస్తృత స్థాయి సమావేశం ఉద్దేశాన్ని మంత్రులు రాజన్న దొర, బొత్స సత్యనారాయణ వివరించారు. 

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడితే తిరిగి మన గౌరవం నిలబెట్టుకుంటామని గుర్తుంచుకోవాలన్నారు. మనస్పర్థలను పక్కన పెట్టి పని చేయాలని సూచించారు. అసమ్మతి నాయకులను పట్టించుకోవద్దని, వారు వెళ్లిపోయినా పార్టీకొచ్చిన నష్టం ఏమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం కాబట్టే ఓటు అడిగే హక్కు ఉందని పేర్కొన్నారు. రానున్న 30 రోజుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి మన ప్రభుత్వానికి ఓటెయ్యమని అడగాలన్నారు. కీలకమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మన పార్టీకే వేసేలా చూడాలని వైవీ సుబ్బారెడ్డి శ్రేణులకు సూచించారు. యువత ఓట్లపైనా దృష్టి సారించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర పాటల ద్వారా పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచారు.  

ABOUT THE AUTHOR

...view details