ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

త్వరలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు: విశాఖ పోర్టు చైర్మన్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 7:32 PM IST

Visakhapatnam Port Authorities Will Soon Development Programs: విశాఖలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, రైల్వే శాఖ, పోర్టు సంస్థ సంయుక్తంగా రానున్న కాలంలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు విశాఖ పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు వెల్లడించారు. విశాఖ పోర్టును గ్రీన్ పోర్టుగా మార్చేందుకు సోలార్ పవర్ ప్యానల్, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నామని తెలిపారు. విశాఖ పోర్టులో గణతంత్ర దినోత్సవ వేడుకలను సమస్త మైదానంలో ఘనంగా నిర్వహించారు. పోర్టు సంస్థ చైర్మన్ అంగముత్తు జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. సైనిక భద్రతా దళాల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రూ.35 కోట్ల వ్యయంతో కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రాజెక్టులను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖ పోర్టు 90వ ఆవిర్భావ దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఒకేసారి రావడం ఎంతో ఆనందకరంగా ఉందని అంగముత్తు అన్నారు. విశాఖ పోర్టు సంస్థలోని ఛానల్ ప్రాంతాన్ని రానున్న కాలంలో నగర వాసులు ఇక్కడ ఆహ్లాదంగా గడిపేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నామని అంగముత్తు వివరించారు. విశాఖ పోర్టు సంస్థకు సంబంధించిన అనేక విభాగాల సిబ్బంది అధికారులను అంగముత్తు అభినందించారు.  

ABOUT THE AUTHOR

...view details