ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖలో సీఎం సభకు ఆర్టీసీ బస్సులు తరలింపు - ప్రయాణికులకు ఇక్కట్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 7:35 PM IST

Visakha City Buses Moved To Aadudam Andhra Program: జగనన్న సమావేశం అనగానే ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. సీఎం సభకు ఆర్టీసీ బస్సులు, ప్రజలను బలవంతంగా తరలించటం, వ్యాపార దుకాణాలు మూయించటం, బస్సులు(Buses) లేక ప్రయాణికులు అగచాట్లు పడటం జరుగుతున్నాయి. ఈరోజు విశాఖలో ఆడుదాం ఆంధ్రా ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ రావడంతో విశాఖవాసులకు కష్టాలు తప్పలేదు.

విశాఖ పీఎం పాలెంలో జరిగే ఆడుదాం ఆంధ్రా(Andudam Andhra) ముగింపు కార్యక్రమానికి భారీగా జనాలను అధికారులు తరలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న డ్వాక్రా మహిళలు, పింఛన్ దారులను సిటీ బస్సుల్లో సభకు తరలించారు. బస్సులన్నీ సభకు వెళ్లడంతో సిటీ బస్‌స్టాండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీయడానికి గత సంవత్సరం డిసెంబరు 26న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి విధితమే. 47 రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో రాణించిన వారికి రూ. 12కోట్లతో నగదు బహుమతులు అందించారు. 

ABOUT THE AUTHOR

...view details