శ్రీవారి దర్శించుకున్న ప్రముఖులు - ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు - tirupati latest news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 2:09 PM IST
VIPs who visited in tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రముఖుల తాకిడి పెరిగింది. ఇవాళ తిరుమల స్థానిక ఆస్థాన మండపంలో నిర్వహించే ధార్మిక సదస్సులో పాల్గొనేందుకు పలువురు పీఠాధిపతులు హాజరయ్యారు. వారంతా తిరుమల వచ్చి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కేంద్ర సహాయక మంత్రి మురుగన్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, హస్యనటుడు శివారెడ్డి శ్రీవారిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారికి ఘన స్వాగతం పలికారు.
Temple Authorities have Made Special Arrangements for Darshan for VIP : వీఐపీల తాకిడిని దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రముఖులు గర్భాలయంలో వేరు వేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీవారి హుండీలో కానుకలను సమర్పించారు. రంగనాయకుల మండపంలో వీరందరికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని వీఐపీలు తెలిపారు.