ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పరిహారం అందలేదంటూ పవన్‌ను కలిసిన వరద బాధితులు - - Vijayawada Flood Victims met Pawan - VIJAYAWADA FLOOD VICTIMS MET PAWAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 10:37 PM IST

Vijayawada Flood Victims met Deputy CM Pawan Kalyan: విజయవాడలో వచ్చిన వరదలలో బాధితులకు సరైన పరిహారం ఇవ్వలేదంటూ కొంతమంది మహిళలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. విజయవాడ 38వ డివిజన్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల తమ ప్రాంతంలో 300 ఇళ్లు నీట మునిగిపోయాయని, తీవ్రంగా నష్టపోయామని తమను ఆదుకావాలంటూ పవన్ కల్యాణ్​కి వినతిపత్రం అందించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చిన నసీమా, ఇతర బాధితుల నుంచి వినతుల పవన్ స్వీకరించారు. 38వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతం వరదల వల్ల ప్రభావితం కాలేదని అధికారులను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్​కు తక్షణమే వివరాలు పంపించి తగిన చర్యలు తీసుకోవాలి తన కార్యాలయ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details