కర్నూలులో ఆటోడ్రైవర్ల ఆందోళన- జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరిక - పట్టణ పౌర సంక్షేమ సభ్యులు నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 7:13 PM IST
Urban Welfare Members Protest Traffic Signals Removed: కర్నూలులో ట్రాఫిక్ సిగ్నల్ సెన్సార్ కెమెరాలను తొలగించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేసి ఫైన్లు వేయడంతో ఒక్కో ఆటోకు రూ.10 నుంచి 13 వేల రూపాయల వరకు ఫైన్ పడుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామన్యులకు వేల రూపాయాలలో ఫైన్ వేస్తే ఎలా చెల్లిస్తారని పట్టణ పౌర సంక్షేమ సభ్యుడు నాగరాజు ప్రశ్నించారు. నగరంలో అవసరానికి మించి ఏర్పాటు చేసిన సెన్సార్ కెమెరాలను వెంటనే ప్రభుత్వం తొలగించాలని పౌర సంక్షేమ సభ్యులు డిమాండ్ చేశారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో కర్నూలులో ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం సెన్సార్ కెమెరాల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతుందని పౌర సంక్షేమ సభ్యులు మండిపడుతున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా లేనిచోట కూడా సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేసి సామాన్యులకు వెేల రూపాయాలు ఫైన్ వేస్తున్నారని నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా ఏర్పాటు చేసిన సెన్సార్ కెమెరాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ సెన్సార్ కెమెరాలను తొలగించుకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఆటో డ్రైవర్లు హెచ్చరించారు.