కాలం సామాన్యుని నుంచి తత్వవేత్తల వరకు అందరికీ పరీక్ష పెడుతుంది - Speech of Dr Umar Alisha
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 7:21 PM IST
Umar Alisha 96th Mahasabhalu 2024 : కాకినాడ జిల్లా పిఠాపురంలో పీఠం ప్రధాన ఆశ్రమంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్వర్యంలో 96వ వార్షిక జ్ఞాన మహా సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పద్మరాజు పాల్గొన్నారు. మానవుడి జీవనంలో ఎదురయ్యే కష్టాలు, దు:ఖాలు, బాధలను ఎదుర్కోవాలంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అలీషా పేర్కొన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఈ సృష్టిలో ఏదీ లేదన్నారు. సామాన్యుని మెుదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరికీ పరీక్ష పెడుతుందని ఆయన తెలిపారు.
Speech of Dr. Umar Alisha : దైవం మానుష్య రూపేణా అనే మాటలకు నిలువెత్తు నిదర్శనం అలీషా అని వైస్ ఛాన్సలర్ పద్మరాజు అన్నారు. సర్వ మానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడుతున్న అలీషా సేవలను కొనియాడారు. పీఠాధిపతి ద్వార జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరింత మందికి అందించాలని ఆయన సూచించారు. అలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, పక్షుల కోసం తయారు చేసిన ధాన్యపు కుచ్చులను విద్యార్థులకు అందజేశారు.