అయోధ్యకు తిరుపతి నుంచి లక్ష లడ్డూలు - TTD Sends One Lakh Laddu To Ayodhya
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 20, 2024, 1:05 PM IST
TTD Sends One Lakh Laddus To Ayodhya: ఈరోజు అయోధ్యకు తిరుపతి నుంచి లక్ష లడ్డూలను పంపించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో వీర బ్రహ్మం తెలిపారు. శ్రీవారి లడ్డూలను అయోధ్యకు తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. లడ్డూలను ప్రత్యేక విమానంలో అయోధ్యకు తరలించేందుకు శుక్రవారం రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక వాహనంలో లడ్డూలను తరలించినట్టు జేఈవో తెలిపారు. లడ్డూలను స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసామని, ఇందుకు ఇద్దరు పాలక మండలి సభ్యులు సహకరించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయోధ్య రాముని ప్రారంభోత్సవానికి శ్రీవారి లడ్డూలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని జేఈవో చెప్పారు.
జనవరి 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ మహాత్సవానికి ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందింది.