ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రోడ్డెక్కిన రైలు ఇంజన్ ​- ఆసక్తిగా తిలకించిన జనం - Train Engine on Lorry In Anantapur

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 5:55 PM IST

Train Engine on Lorry In Anantapur District : పట్టాలపై దూసుకెళ్లాల్సిన రైలు రోడ్డు ఎక్కడం ఏంటి అనుకుంటున్నారా ! అవునండీ రైలు రోడ్డెక్కింది. అయితే కాస్త ఆగండి. రోడ్డెక్కింది రైలు కాదు రైలింజన్​ మాత్రమే. అదేనండి రైలింజన్​ను లారీపై తరలిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసీ అందరూ రైలు రోడ్డెక్కిందని అనుకుంటున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ 42వ జాతీయ రహదారిపై రైలు ఇంజన్​ను లారీ తీసుకెళ్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఉత్తరప్రదేశ్​లోని ఝాన్సీ నుంచి బళ్లారి రైల్వే జంక్షన్​కు కొత్త రైలు ఇంజన్​ను లారీ మీద తరలించారు. ఈ లారీ ఈ నెల 16న లారీ ఝాన్సీలో బయలుదేరినట్లుగా వాహన డ్రైవర్లు తెలిపారు. దీంతో గ్రామాల మీదుగా లారీ మీద వెళ్లడంతో రైలును చూడడానికి స్థానికులు ఎగబడ్డారు. కొంచెం కొత్తగా ఏది కనబడ్డా జనం అసక్తి కనబరుస్తారు. ఉరవకొండలో ఒకర్ని చూసి మరొకరు ఈ దృశ్యాన్ని చూసేందుకు అంతా ఒక్క దగ్గరు చేరి వీక్షించారు. రైళ్లపై లారీలు వెళ్లడం చూశాం కానీ లారీపై రైలింజన్​ చూడడమే వింతే అంటున్నారు జనాలు. 

ABOUT THE AUTHOR

...view details