'విశాఖలో ప్రభుత్వాన్ని నిలదీసేలా బ్యానర్లు'- విచారణ చేపట్టిన అధికారులు - TNSF Banner - TNSF BANNER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 13, 2024, 5:07 PM IST
TNSF Banner Issue in Visakha East Constituency : విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ పేరిట బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. ఎంవీపీ బస్ కాంప్లెక్స్ సమీపంలో 8 ప్రశ్నలతో కూడిన బ్యానర్లు వెలిశాయి. ఇవి ప్రజలను ఆలోచింపజేసేలా ఉన్నాయి. వీటిని నగర వాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. TNSF పేరిట బ్యానర్లను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.
"విశాఖలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసింది ఎవరు? ఐపీఎస్ పోలీస్ అధికారుల స్థలాలను కూడా కబ్జా చేసింది ఎవరు? శవాలను పూడ్చే శ్మశానాలకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసింది ఎవరు? సిరిపురం కూడలిలో ఉన్న CBCNC క్రిస్టియన్ ఆస్తులను కొట్టేసింది ఎవరు? ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చిన ఆశ్రమ స్థలాలను కాజేసింది ఎవరు? అధికార దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలు విలువ చేసే టీడీఆర్ బాండ్లను కొట్టేసింది ఎవరు? ల్యాండ్ కబ్జాలతో తల దూర్చి సొంత కుటుంబానికి సైతం రక్షణ కల్పించుకోలేని దుస్థితిలో ఉన్న ప్రజాప్రతినిధి ఎవరు? " వంటి ప్రశ్నలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.