ఈతకు వెళ్లి కృష్ణా నదిలో ముగ్గురు విద్యార్థులు మృతి - AP Latest News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 9:20 PM IST
Three Students Drowned in Krishna River: కృష్ణా నదిలో ఈత కొట్టడానకని వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులు ఒక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతంలో మరో ఇద్దరు విద్యార్థులు ఒడ్డున ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే విజయవాడ పడమటకు చెందిన నడుపల్లి నాగసాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్, ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న గగన్ వీళ్లు ముగ్గురు ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం రెండు గంటలు సమయంలో నది వద్దకు ఈత కని వచ్చి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నాడు. కాకపోతే వారు ఒడ్డునే ఉన్నారు. వీరు చూస్తుండగానే ముగ్గురు నీళ్లలో మునిగిపోతండటంతో పక్కన ఉన్న స్థానికులను పిలిచేలోపే ముగ్గురు మునిగిపోయారు. అనంతరం వారిని బయటకు తీసుకువచ్చినా అప్పటికే మృతి చెందారని స్థానికులు తెలిపారు. విద్యార్థుల మృతితో ఆ ప్రాంతంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు