అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెనాలి యువతి మృతి - STUDENT DIED IN AMERICA ACCIDENT - STUDENT DIED IN AMERICA ACCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 10:22 PM IST
Tenali Girl Jetti Harika Dies in Road Accident in America : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి జెట్టి హారిక(25) మృతి చెందారు. తెనాలికి చెందిన జెట్టి హారిక గత ఏడాది ఆగస్టులో ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు. హోమా స్టేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోయినట్లు ఆమెరికా నుంచి ఫోన్ వచ్చిందని హారిక కుటుంబ సభ్యులు తెలిపారు. హారిక తండ్రి జెట్టి శ్రీనివాసరావు దేవాదాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి. హారిక ఉన్నత చదువుల కోసం బ్యాంకులో రుణం తీసుకుని మరీ అమెరికా పంపించామని తల్లిదండ్రులు తెలిపారు.
అమెరికాలో హారిక మృతదేహం కోసం తమ బంధువులు వెళితే అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి హారిక మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్‌ఆర్‌ఐలతో సంప్రదిస్తున్నారు.