ఆంధ్రప్రదేశ్

andhra pradesh

క్లాస్​రూంలో గురకపెట్టి నిద్రపోయిన టీచర్- వీడియో తీసి పోస్ట్ చేసిన పేరెంట్స్ - teacher sleeping in classroom video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 10:18 PM IST

Teacher Sleeping in Classroom Video (ETV Bharat)

Teacher Sleeping in Classroom Video: తరగతి గదిలో విద్యార్థులు నిద్రపోతే వారించాల్సిన ఉపాధ్యాయుడే గురక పెట్టి మరీ నిద్రపోతే ఇంకేమైనా ఉందా. ఇక విద్యార్థులకు ఏమని చెబుతారు అటువంటి ఉపాధ్యాయుడు. ఇలాంటి సంఘటనే సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిద్రపోతున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్​గా మారింది. శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం పరాకు వాండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రామాంజనేయులు ప్రతిరోజు మధ్యాహ్నం తరగతి గదిలో నిద్రపోతుండటం తల్లిదండ్రులు గమనించారు. 

పిల్లలను పట్టించుకోకుండా నిద్రపోవడం సరికాదని ఉపాధ్యాయుడికి సూచించారు. ఈ పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆయన తరగతి గదిలో నిద్రపోతుండటంతో గ్రామస్థులు దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. ఈ విషయం మండల విద్యాధికారి లలితమ్మ దృష్టికి వెళ్లింది. ఉపాధ్యాయుడు నిద్రపోతున్న వీడియోపై ఎంఈఓ స్పందిస్తూ ఉపాధ్యాయుడు రామాంజనేయులకు నోటీసు ఇస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details