ఇదేంది జగనన్నా - అధికారంలో ఉండి పావలా వంతు పనైనా చేశారా?: తెలుగు యువత - సంగం వద్ద టీడీపీ నిరసన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 3:57 PM IST
TDP Protest At Sangam Barrage in Nellore : నెల్లూరు నగరంలో టీడీపీ హయాంలో 84 శాతం పూర్తి చేసిన మంచి నీటి పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికి వదిలి వేసిందని తెలుగు యువత నేతలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో 16 శాతం పనులను పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. తెలుగు యువత (TDP Youth) ఆధ్వర్యంలో సంగం వద్ద నిరసన (Protest) తెలిపారు. నెల్లూరు నుంచి 35 కిలో మీటర్లు యాత్ర చేస్తూ ప్రాజెక్ట్ విషయంలో అధికార పార్టీ వ్యవహరించిన తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ మంచినీటి పథకం పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వం (YSRCP government) నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని నేతలు తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో నెల్లూరులో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రభుత్వం తాగునీటి ప్రాజెక్ట్ విషయంలో ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని మండిపడ్డారు. అధికార వైఎస్సార్సీపీ పావలా వంతు పనులు కూడా పూర్తి చెయ్యలేకపోయిందని ధ్వజమెత్తారు.