గుడివాడలో తెలుగుదేశం నేతల 'చలో టిడ్కో కాలనీ కార్యక్రమం' - TDP Leaders Chalo TIDCO Colony
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 5:01 PM IST
TDP Leaders Chalo TIDCO Colony Program: కృష్ణాజిల్లా గుడివాడలో తెలుగుదేశం నేతలు చలో టిడ్కో కాలనీ కార్యక్రమం చేపట్టారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ బాధ్యులు వెనిగండ్ల రాము అధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీగా కాలనీకు చేరుకుని, అధ్వాన్నంగా ఉన్న కాలనీ పరిస్థితులను పరిశీలించారు. కాలనీ సమస్యలను స్థానికులు నేతలకు వివరించారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో టిడ్కో ఇల్లు అన్నీ ఉచితంగా అయ్యేటట్లు తాను బాధ్యత తీసుకుంటానని వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు.
మౌలిక సదుపాయాలు కల్పించి, అందమైన కాలనీగా టిడ్కో లే అవుట్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కనీసం తాగు నీరు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు పడుతున్న కష్టాలకు చలించి పోయానన్నారు. కాలనీలో తాగునీటి సరఫరాకు పది ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని, మున్సిపల్ అధికారులు తమ ట్యాంకర్లకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంచి సమాజం కోసం పాటు పడుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.