తిరుమలలో భూఅక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలేవి ?: టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్ - Saptagiri Prasad comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 6:10 PM IST
TDP Leader Saptagiri Prasad Comments on Tirumala irregularities : పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని భూ అక్రమాలు, కబ్జాలకు నెలవుగా మార్చరని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధీనంలో ఉన్న భూముల్లో అక్రమ కట్టడాలకు పాల్పడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తిరుమల కొండపై శారదా పీఠం భూమి ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా ఈవో ధర్మారెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
తిరుమల దేవస్థానం భూములను ఎవరైనా ఆక్రమిస్తే వాటిని రెగ్యులర్ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని హైకోర్టు సృష్టం చేసినా శారద పీఠం వారికి చట్టం వర్తించదా అని సప్తగిరి ప్రసాద్ వ్యాఖ్యానించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి నిర్లక్ష్య ధోరణికి వల్లనే దేవాలయాల భూములు అక్రమాలు, కబ్జాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందరివాడైన అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, ఈవో ధర్మారెడ్డి, సీఎం జగన్ ప్రభుత్వం వల్ల కొందరి వాడ్ని చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.