ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీకి ఇచ్చే ప్రతి విరాళం మెరుగైన ఏపీ దిశగా చేస్తున్న ఉద్యమానికి శక్తినిస్తుంది: లోకేశ్ - Nara Lokesh on TDP Funds - NARA LOKESH ON TDP FUNDS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 10:52 AM IST

Nara Lokesh on Telugu Desam Party Funds: చిన్నా పెద్దా తేడా లేకుండా తెలుగుదేశం పార్టీకిచ్చే ప్రతి విరాళం మెరుగైన ఆంధ్రప్రదేశ్‌ దిశగా తాము చేస్తున్న ఉద్యమానికి శక్తినిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు. చంద్రబాబు ఆవిష్కరించిన వెబ్‌సైట్‌ ద్వారా 99వేల 999 రూపాయల మొత్తాన్ని ఆయన పార్టీకి విరాళంగా అందజేశారు.

విరాళాలు ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర, పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావును ఎక్స్‌ వేదికగా నామినేట్‌ చేశారు. వారు కూడా ఒక్కొక్కరు మరో ముగ్గుర్ని విరాళాలు ఇవ్వాల్సిందిగా నామినేట్‌ చేయాలని సూచించారు. వెబ్‌సైట్‌కు ప్రచారం కల్పించటంతో పాటు రాష్ట్రంలో మార్పు తెచ్చే ఈ పనిని ఉద్యమంలా మార్చాలని లోకేశ్​ కోరారు.

Chandrababu Launched TDP Website for Donations: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఏ  పార్టీ అయినా కార్యకలాపాలు నిర్వహించేందుకు నిధులు కావాల్సిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక వెబ్​సైట్​ను ఎన్టీఆర్ భవన్​లో లాంఛనంగా ఆవిష్కరించారు. పార్టీ విరాళాల కోసం https://tdpforandhra.com వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details