ఓట్ల అక్రమాలపై టీడీపీ నేత ఫిర్యాదు- ఒకే నియోజకవర్గంలో 2,200 డబుల్ ఎంట్రీలు - ఓట్ల అక్రమాలపై టీడీపీ నేత ఫిర్యాదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 10:28 AM IST
|Updated : Feb 7, 2024, 1:17 PM IST
TDP Leader Complained to Irregularities of Voter List: ఓటర్ల జాబితాలో అవకతవకలు సవరించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మాజీ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. తెలుగుదేశం నేతలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి మున్సిపల్ కమిషనర్‌కు ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 2,200 డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ నెల 15 లోపు ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని అధికారులకు ఆయన డెడ్ లైన్ పెట్టారు.
మూడు వారాల క్రితం 16వ డివిజన్లో 14 పేర్లు ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, కమిషనర్ ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, మృతుల వివరాలను సరిచేసి జాబితా విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో ఆ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతానని వెల్లడించారు. ఓటర్ వెరిఫికేషన్‌పై తాము ప్రత్యేక దృష్టి పెట్టామని నాారాయణ తెలిపారు. నిస్పక్షపాతంగా ఓటరు జాబితాను విడుదల చెయ్యాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు.