ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్ ఇప్పటికీ భ్రమల్లో బతుకుతున్నారు: బుద్దా వెంకన్న - TDP Leader Buddha Venkanna - TDP LEADER BUDDHA VENKANNA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 15, 2024, 2:56 PM IST

TDP Leader Buddha Venkanna Slams YS Jagan: ఐదేళ్లు కళ్లు మూసుకుంటే మళ్లీ అధికారమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలలు కంటున్నారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ఫైర్‌ అయ్యారు. అధికారంలో ఉండి కూడా ఐదేళ్లు కళ్లు మూసుకున్నారని ఆయన మండిపడ్డారు. జగన్‍ను భరించలేకే ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. జగన్ ఇప్పటికీ భ్రమల్లో బతుకుతున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. పేదలకు పెన్షన్ విషయంలో కూడా జగన్ రాజకీయం చేశారన్నారు. సంపద సృష్టించడం చేతకాని జగన్.. రాష్ట్రాన్ని అప్పులప్రదేశ్‍గా మార్చారని దుయ్యబట్టారు. జగన్ జైలుకు వెళ్లడం, వైఎస్సార్సీపీ భూస్థాపితం అవడం ఖాయమని జోష్యం చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ జగన్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోర్టుకు వెళ్లలేదని అన్నారు. ఇప్పటికైనా అక్రమ ఆస్తులు తదితర కేసుల్లో జగన్ కోర్టుకు హాజరుకావాలని బుద్ధా వెంకన్న హితవుపలికారు.

జగన్ వ్యాఖ్యలు: ‘‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి. ఇప్పటి వరకూ సినిమాలో ఫస్ట్‌ ఆఫ్‌ మాత్రమే అయింది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఇదే అంశంపై టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details