ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబు దేవుడు- టిక్కెట్టు కోసం వత్తిడి చేయను! తన రక్తంతో బాబుపై అభిమానం చాటిన బుద్దా వెంకన్న - టీడీపీ నేత బుద్దావెంకన్న

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 4:36 PM IST

 TDP leader Buddha Venkanna: చంద్రబాబు తనకు టిక్కెట్ ఇవ్వకున్నా తాను వ్యతిరేకించనని తెలుగుదేశం సీనియర్‌ నేత బుద్దావెంకన్న స్పష్టంచేశారు. కేశినేని తన దరిద్రానికి పార్టీలోకి వచ్చాడన్న ఆయన, తనను తప్పించాలని కేశినేని నాని తెగ ప్రయత్నించాడని మండిపడ్డారు. 2019లో ప్రభుత్వం కొల్పోయింది. ఆ తర్వాత కూడా కేశినేని నాని తననే టార్గెట్ చేశాడని ఆరోపించారు. 175 స్థానాల్లో పశ్చిమ సీటు ఒక్కటే పక్కన పెడుతున్నారని, 174 స్థానాల్లోనే ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతున్నారన్న ఆయన, ఇది తనకు బాధ కలిగించిందని తెలిపారు. చంద్రబాబుకు తనకన్నా ఎక్కువ అభిమానం ఎవ్వరికి ఉండదని తెలిపారు. విజయవాడ లేదా అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కోరారు.

బుద్దావెంకన్న తన రక్తంతో  చంద్రబాబు చిత్ర పటానికి కాళ్లు కడిగారు. సీబీఎన్ జిందాబాద్ అంటూ రక్తంతో గోడ మీద రాశారు. తన అభిమానం చాటుకునేందుకే ఇదంతా చేస్తున్నానని బుద్దావెంకన్న తెలిపారు.  చంద్రబాబుపై తనకున్న ప్రేమను ఎన్నోసార్లు ప్రదర్శించానని తెలిపారు. చంద్రబాబు తనకు దేవుడి లాంటోడని, టికెట్ విషయంలో చంద్రబాబుపై ఎలాంటి ఒత్తిడి చేయబోనని తెలిపారు. ఇది కేవలం అభిమానంతో చేసే పని మాత్రమే అని బుద్దావెంకన్న తెలిపారు. తన రాజకీయ ఎదుగుదల కోసం చంద్రబాబు ఎంతో ప్రోత్సహించారని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details