ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్‌ అర్జునుడు కాదు, భస్మాసురుడు: అచ్చెన్నాయుడు - Achchennaidu Allegations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 9:31 PM IST

TDP leader Achchennaidu: ఓటమి భయంతోనే జగన్ అవాకులు, చెవాకులు పేలుతున్నాడని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణతో వైకాపా ఫ్యాను రెక్కలు విరిగిపోతున్నాయని దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేక సునామీలో జగన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయమని అచ్చెన్న పేర్కొన్నారు. ఓటనే ఆయుధంతో జగన్ కి ప్రజలు రాజకీయ సమాధి కడతారని ఆయన అన్నారు. దెందులూరు సభలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 57 నెలల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తమపై నిందలా అని అచ్చెన్న నిలదీశారు.  

పన్నులు, ధరలు, చార్జీల పెంపుతో ప్రతి కుటుంబంపై 8 లక్షల రూపాయల భారం మోపిన పేదల ద్రోహి జగన్ అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అబద్ధాల పునాదుల మీద పాలన చేస్తున్న జగన్ రెడ్డి అర్జునుడు కాదు భస్మాసురుడని అచ్చెన్న విమర్శించారు. యుద్ధానికి ముందే ఓటమి ఒప్పుకున్న పిరికిపంద అని దుయ్యబట్టారు. బాబాయ్ ని చంపి, తల్లి, చెల్లిని తరిమేసి మహిళా పక్షపాతివా అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజా రాజధాని అమరావతిని చంపేశాడని ఆక్షేపించారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని ప్రశ్నార్థం చేశాడని, వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమన్నారు. భారతరత్న అవార్డు గ్రహీత భాజపా అగ్రనేత ఎల్.కె.అద్వానీకి అచ్చెన్న శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి నిబద్దతతో పనిచేసిన వారికి గౌరవం దక్కుతుందనేదానికి ఇదే ఉదాహరణని కొనియడారు. 

ABOUT THE AUTHOR

...view details