ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి హత్యా రాజకీయాలు చేస్తున్నారు- జయరాం నాయుడు అరెస్టు అక్రమం: టీడీపీ - TDP Leader BALLA PALLAVI - TDP LEADER BALLA PALLAVI

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 1:41 PM IST

TDP Former Corporator Balla Pallavi Comment on YSRCP MLA Ananta Venkatrami Reddy : అనంతపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హత్యా రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ మాజీ కార్పొరేటర్‌ బల్లా పల్లవి, చంద్రదండు వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు మండిపడ్డారు. వ్యక్తిగత కారణాలతో తెలుగుదేశం, వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొడవపడితే ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడును అక్రమంగా అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఓటమి భయంతోనే హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Anantapur District : మే 13న జరిగే ఎన్నికల్లో అనంతపురం ప్రజలు ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని బల్లా పల్లవి వెల్లడించారు. గత ఎన్నికల్లో ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఈ అయిదేళ్లలో నగరంలో ఎక్కడా అభివృద్ధి చేయకుండా మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details