ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సీఎం జగన్‌ పర్యటనతో చెట్లు కొట్టేసి చిరు వ్యాపారుల పొట్ట కొట్టారు: జేసీ ప్రభాకర్ రెడ్డి - JC Prabhakar Fires on Ycp govt - JC PRABHAKAR FIRES ON YCP GOVT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 6:19 PM IST

Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy  Fires on YSRCP Govt : తాడిపత్రిలో సీఎం జగన్‌ పర్యటన సందర్భంగా చిరు వ్యాపారుల పొట్ట కొట్టారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే (MLA) చిరు వ్యాపారులపై ఫ్యాక్షనిజం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటన సందర్భంగా తాడిపత్రిలో గత మూడు రోజులుగా ఆంక్షలు విధించారు. రోడ్డు పక్కనున్న చిరు వ్యాపారుల దుకాణాలు మూయించారు. రేకుల షెడ్లు కూల్చి వేశారు. 

దీంతో చిరు వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఓట్లు వేసినందుకు చిరు వ్యాపారులకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అరాచకం తప్ప అభివృద్ధి లేదని, తాడిపత్రి పట్టణాన్ని నాశనం చేశారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హామీలతో బొంకడం తప్ప జగన్​ ప్రభుత్వం, స్థానిక ప్రజా నేతలు తమకు చేసిందేం లేదని ప్రజలు వాపోతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details