ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విపత్తు సమయంలో ఆపద్బాంధవుడు - డ్రోన్ల రూపకల్పనలో సత్తా చాటిన తిరుపతి ఐఐటీ

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Students of IIT Tirupati have Experimented with Drones : ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఒక్కసారిగా ఆ ప్రాంతంలోని చెట్లు, ప్రాణుల జీవనం అస్తవ్యస్తం అవుతుంది. సహాయక చర్యలు అందించడమూ కష్టతరంగా మారుతోంది. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో బాధితులను వేగంగా గుర్తించి సహాయక చర్యలు అందిస్తే ప్రయోజనంగా ఉంటుంది. ఈ ఆలోచనకే ప్రాణంపోస్తూ సరికొత్త సాంకేతికత రూపొందించారు తిరుపతి ఐఐటీకి చెందిన ఇంజినీరింగ్‌ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "మన చుట్టు పక్కల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులను చూశాం. అప్పుడు మాకొచ్చిన ఆలోచనతో మొదటిసారిగా అస్సాం రాష్ట్రంలో 2022లో వచ్చిన వరదల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశాం. 

అలాగే వరదల్లో మునిగిపోతున్న మనుషులు, వాహనాలు, జంతువులను గుర్తించి ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ఓ రకమైన డ్రోన్లను ఏర్పాటు చేశాం. 
అదేవిధంగా పెనుగాలులు, భారీ వర్షాలతో సెల్‍ టవర్లు కూలిపోయి నెట్‍ వర్క్ సమస్యలతో సమాచార మార్పిడి లేక వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలకు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు మరో రకమైన డ్రోన్లను వినియోగిస్తాం. దీంతో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సహాయక చర్యలు చేపట్టేందుకు సులువుగా ఉంటుంది" అని తెలిపారు. రాష్ట్రంలో కొద్దిరోజుల క్రితం జరిగిన డ్రోన్‌ సమ్మిట్‌లో తమ ఆవిష్కరణకు మూడవ బహుమతి వచ్చిందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details