బిల్డింగ్‌పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య - Degree Student Suicide - DEGREE STUDENT SUICIDE
Published : Apr 12, 2024, 8:45 PM IST
Degree Student Suicide In Malkajgiri : డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థిని రెండు పడకల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరిగింది. విద్యార్థిని మృతిలో స్థానికంగా విషాదవాతావరణం అలుముకుంది.
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : జవహర్‌నగర్ పరిధిలోని కార్మిక నగర్‌కు చెందిన గంగారపు మనోహర్ కుమార్తె చిత్ర శివాని(18). ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజులానే కళాశాలకు వెళ్లిన విద్యార్థిని మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాప్రా సాయినగర్‌లోని రెండు పడకల భవనంపైకి ఎక్కి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌ను పిలిపించారు. అయితే విద్యార్థిని అప్పటికే మృతిచెందినట్లుగా వారు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్ర శివాని ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.