LIVE: అయోధ్యలో వైభవంగా శ్రీరాముడి కళ్యాణ వేడుకలు - ప్రత్యక్ష ప్రసారం - Sri Rama Navami in Ayodhya - SRI RAMA NAVAMI IN AYODHYA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 12:16 PM IST
|Updated : Apr 17, 2024, 12:26 PM IST
Sri Rama Navami in Ayodhya Live : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత జరగనున్న మొదటి శ్రీరామనవమి వేడుకల కోసం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో యోగీ సర్కార్ అయోధ్య పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. 560 సీసీటీవీ కెమెరాలతో ఆలయం పరిసరాలను నిరంతరం కంట్రోల్ రూమ్‌ల నుంచి పోలీసులు పర్యవేక్షించనున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని అయోధ్యకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా 4 రోజుల పాటు అంటే సోమవారం నుంచి గురువారం వరకు వీఐపీ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అలాగే బాలక్రాముడి హారతి సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాజస్థాన్ నాథ్ద్వారాలోని శ్రీనాథ్‌జీ అనే ఓ పురాతనమైన శ్రీ కృష్ణుడి ఆలయం నుంచి తొలిసారి మఠడీ అనే మహాప్రసాదాన్ని అయోధ్య రాముడి కోసం తరలించారు. బాలక్రాముడికి ఈ మఠడీ ప్రసాదాన్ని నివేదించిన తర్వాత గుడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచనున్నారు. ఈ మేరకు లక్ష మఠడీల మహాప్రసాదాన్ని అయోధ్యకు పంపినట్లు శ్రీనాథ్‌జీ ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Last Updated : Apr 17, 2024, 12:26 PM IST