తెలంగాణ

telangana

భద్రాద్రిలో కోటి తలంబ్రాల వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు - Koti Talambralu Vithanalu Pooja

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 12:47 PM IST

భద్రాద్రి రామాలయంలో వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు (ETV Bharat)

Koti Talambralu Vithanalu Pooja in Bhadrachalam : ఏటా శ్రీరామనవమి రోజు భద్రాద్రి సీతారాముల కల్యాణానికి సమర్పించే కోటి గోటి తలంబ్రాలను పండించే పంట కోసం కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి భద్రాద్రి రాములవారి సన్నిధిలో పూజలు చేశారు. 14వ కోటి గోటి తలంబ్రాల మహా యజ్ఞంలో భాగంగా పూజలు నిర్వహించినట్లు శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణ అప్పారావు తెలిపారు. గత 14 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది ముందుగా వరి విత్తనాలను భద్రాచలం తీసుకువచ్చి స్వామివారి పాదాల ఎదుట ఉంచి ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పారు.

అనంతరం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో ఈ విత్తనాలతో పంటను పండించి, పండిన వరి ధాన్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళా భక్తులకు పంపిణీ చేస్తామని అప్పారావు వెల్లడించారు. మహిళలంతా వరి ధాన్యాన్ని శ్రీరామ నామ స్మరణలతో కోటి గోటి తలంబ్రాలను తయారుచేసి భద్రాచలంలోని సీతారాముల కల్యాణానికి సమర్పిస్తారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details