ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అశ్వవాహనంపై చంద్రమౌళీశ్వరుడి ఊరేగింపు - కన్నుల పండువగా లంకా దహనం - Rathotsavam in Uravakonda - RATHOTSAVAM IN URAVAKONDA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 2:46 PM IST

Sri Chandramouleshwara Swamy Rathotsavam Grandly Held Uravakonda :  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామివారి ఉత్సవాల్లో భాగంగా చంద్రమౌళీశ్వరుడు అశ్వవాహనంపై విహరించారు. అనంతరం లంకాదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రథోత్సవం అనంతరం జరిగే లంకాదహనం (బాణసంచా వేడుక) కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతులతో భక్తులను (Devotees) అలరించాయి. ముందుగా శ్రీచంద్రమౌళీశ్వర స్వామి వారికి విశేష పుష్పలంకారాలు జరిపి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అశ్వవాహనంపై ఉత్సవ విగ్రహాన్ని ఉంచి భాజభజంత్రీల నడుమ బసవన్న గుడి వరకు ఊరేగించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి. లంకాదహణం జరిపారు. లంకాదహన కార్యక్రమానికి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ట్రాక్టర్లు, ఆటోలు, వివిధ వాహనాలపై పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో ఉరవకొండ (Uravakonda) పట్టణ పరిసరాలన్నీ జనసందోహంగా మారాయి. ఈ సందర్భంగా ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details